సంగారెడ్డి పట్టణం శ్రీనగర్ లో వెలిసిన శ్రీ క్షేత్రంలో స్వాతి నక్షత్ర వేడుకలు సోమవారం నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని వేదమంత్రాలతో చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.