గ్రామాల్లో అంటూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ జిల్లా అధికారి, మండల ప్రత్యేక అధికారి లలిత కుమారి అన్నారు. కంది ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.