వాసవి మా ఇల్లు, సాంఘిక శాస్త్రం ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఐదవ తేదీన సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్లో ఉదయం 11 గంటలకు పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్ శుక్రవారం తెలిపారు. జిల్లాలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రతిభా పరీక్ష పోటీలకు హాజరుకావాలని కోరారు.