జిల్లాలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఈనెల 2వ తేదీన హైదరాబాద్ లో జరిగే సీఎం సమావేశానికి తరలిరావాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు సాబేరని కోరారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ లోని సంఘ భవనంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్ల తర్వాత ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి రమేష్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాథోడ్ పాల్గొన్నారు.