సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నల్లపల్లిలోని ప్యారానగర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ఇటీవల అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులను పరామర్శించేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.