అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీన సంగారెడ్డిలో నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ కోరారు. సంగారెడ్డిలో గోడపత్రికలను శుక్రవారం ఆవిష్కరించారు. సాయంత్రం 5 గంటలకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఎస్పీ పరితోష్ పంకజ్ ర్యాలీని ప్రారంభిస్తారని చెప్పారు. పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు.