అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి సోమవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు చెప్పారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.