సంగారెడ్డి పట్టణం ఇందిరా కాలనీలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయ 11వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలతో శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. ఉమామహేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేశారు. అనంతరం పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు.