సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలొ శానిటేషన్ వర్కర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విద్యాసాగర్ మాట్లాడుతూ. పాఠశాల పరిశుభ్రతలో శానిటేషన్ వర్కర్ల పాత్ర కీలకమన్నారు. ప్రతి రోజు వర్కర్లు పరిసరాలు, తరగతి గదులు, మూత్రశాలలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, శానిటేషన్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.