సంగారెడ్డి: రేపటి సెమినార్ జయప్రదం చేయాలి: సీపీఎం

58చూసినవారు
సంగారెడ్డి: రేపటి సెమినార్ జయప్రదం చేయాలి: సీపీఎం
పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి లోని కేకే భవన్ లో సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే సెమినార్ను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమకాలిన పరిస్థితులు- మన కర్తవ్యం అంశంపై సెమినార్ జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు సుధా భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్