శ్రీ వైకుంఠపురం లో వరుణ హోమం

55చూసినవారు
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠాపురం దేవాలయంలో వరుణ హోమ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం జరిగింది. అనంతరం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యురాలు డాక్టర్ అరుణ కుమార రాజా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్