విరాట్ వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకుడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు ప్రారంభించారు. ఆలయ పురవీధుల మీదుగా ఊరేగింపును తీసుకువెళ్లి గరుడ పుష్కరణ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు గోవిందా. గోవిందా అంటూ నామస్మరణ చేశారు.