మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహిళా సాధికారత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక క్రమశిక్షణలో ముందుంటారని చెప్పారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డిఓ జ్యోతి పాల్గొన్నారు.