అంబేడ్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సోమవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. దళిత, గిరిజన యువత కోసం ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చింది అని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంత కిషన్, జార్జి పాల్గొన్నారు