సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుంచి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ పట్టణంలో గల ఆ అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాణిక్ రావు పులమాలల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బిఆర్ ఎస్ శ్రేణులు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.