మాజీ ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే మణికరావు ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు అన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ తదితరులు పాల్గొన్నారు.