జహీరాబాద్ పట్టణంలో గిరిధర్ రెడ్డి సన్మాన సభలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిహ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవి అనేది సంబరపడే విషయం కాదని, క్రమశిక్షణ కర్తవ్యంగా భావించాలన్నారు. కార్యకర్తలు ప్రతి పార్టీకి వెన్నుపూసలాంటి వాళ్ళని, కార్యకర్తలేనిది ఏ పార్టీ లేదు ఏ నాయకుడు లేడన్నారు.