మొగుడంపల్లి మండలంలోని మన్నాపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం స్కూల్ డే వేడుకలు నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా చిన్నారులు ప్రత్యేక దుస్తులు ధరించి పాల్గొన్నారు. ముఖ్యఅతిథులుగా పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని వారు సూచించారు.