జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కొనింటి మాణిక్ రావు సమక్షంలో పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు యాకూబ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం అల్లీపూర్ గ్రామంలోని ఫయాజ్ నగర్ కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్ వారి బృందం కాంగ్రెస్ పార్టీని విడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.