న్యాల్‌కల్ మండల అధ్యక్షులుగా గంగ్వార్ గ్రామానికి చెందిన మల్లేష్ ని ఎన్నుకున్నట్లు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి అప్పగించిన భాద్యతను పార్టీ నియమ నిబంధనలకు లోబడి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.