జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కే. మాణిక్ రావు సొంత గ్రామమైన ఝరాసంగంలో హక్కు వినియోగించుకున్నారు. ముందుగా జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఝరా సంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి ఝరాసంగం పోలింగ్ బూత్ నంబర్ 62లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.