నారాయణఖేడ్: సిబ్బందికి 4 నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

70చూసినవారు
నారాయణఖేడ్: సిబ్బందికి 4 నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ప్రభుత్వ హాస్పిటల్స్ సిబ్బందికి 4 నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ రమేష్ కి బుధవారం వినతి పత్రం అందజేశారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్ రాజ్యం మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ హౌస్ కీపింగ్ పేషెంట్ కేర్ సిబ్బందికి 4 నెలల వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బంది పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్