భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం పార్టీ నాయకులతో కలిసి పస్తాపూర్ గ్రామంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్, నాయకులు జైపాల్, శికారి గోపాల్, చెంగల్ జైపాల్, గఫార్, పవన్ కుమార్, దిలీప్, అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.