జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ కోహర్, ఝరాసంగం న్యాల్కల్, మొగుడంపల్లి రాయి కోడ్ వివిధ మండలాలలో 139/33 కెవి విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మత్తులు నిర్వహించడం వలన బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని టీజీఎస్పీడీఏ జహీరాబాద్ డివిజన్ అధికారి లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.