మల్కన్ పాడ్ పంచాయతీ ఏర్పాటుకు సన్నద్ధం

57చూసినవారు
మల్కన్ పాడ్ పంచాయతీ ఏర్పాటుకు సన్నద్ధం
న్యాల్‌కల్‌ మండలంలో మరో నూతన గ్రామపంచాయతీ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మండలంలో 37 జీపీలు ఉండగా గతేడాది తాట్ పల్లిని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. తాజాగా మల్కన్ పాడ్ గ్రామాన్ని కొత్త జీపీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశారు. మల్కన్ పాడ్ గ్రామంలో 223 మంది పురుషులు, 231 మంది స్త్రీలు ఉన్నారు. కొత్త జీపీతో స్థానికుల ఆశలు చిగురిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్