సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాటూర్ గ్రామ వ్యవసాయ పొలంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లకు మరమ్మతు చేయాలని వారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువ ఉంది. దీంతో వైర్లు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి.