సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ పరిధి విద్యుత్ అధికారులను ఆసంస్థ చీప్ ఇంజనీర్ కామేష్ మంగళవారం జహిరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ వర్ష కాలం నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విదుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని, చీఫ్ ఇంజనీర్ కామేష్ హెచ్చరించారు.