జహీరాబాద్ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత పది రోజులుగా సిపిఎం బస్తీ బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చిన సమస్యలపై ఈనెల 12న మున్సిపల్ కార్యాలయం ముట్టదించడం జరుగుతుందని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు మహిపాల్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని గురువారం శ్రామిక్ భవన్లో విడుదల చేయడం జరిగింది.