వాహనాల పార్కింగ్ టెండర్ వేలం రూ. 2.65 లక్షలు

53చూసినవారు
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలో వాహనాల పార్కింగ్ టెండర్ బహిరంగ వేలం పాట బుధవారం నిర్వహించినట్లు ఆలయ ఈవో శశిధర్ తెలిపారు. ఈ మేరకు గోపాల్ అనే వ్యక్తి రూ. 2. 65 లక్షలకు వేలం దక్కించుకున్నట్లు చెప్పారు. అయితే ఈ టెండర్ ఏడాది పాటు కొనసాగుతుందన్నారు. వాహనదారులు ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్థలంలోనే వాహనాలు పార్కింగ్ చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్