సంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమానికి సిద్ధం కావాలి

76చూసినవారు
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్, బహుళ జాతి సంస్థల కోసమే పనిచేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు విమర్శించారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్లో పేద మధ్యతరగతి ప్రజలకు ఏం పెట్టలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు జయరాజ్, మల్లేశం, రాజయ్య, మాణిక్, ఆడివయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్