సంగారెడ్డి: బడి బయట 327 మంది చిన్నారులు

72చూసినవారు
సంగారెడ్డి: బడి బయట 327 మంది చిన్నారులు
సంగారెడ్డి జిల్లాలో పాఠశాలకు దూరంగా బడి బయట 327 మంది చిన్నారులు ఉన్నారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 16 నుంచి 31వ తేదీ వరకు బడి బయట పిల్లలపై సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు 307, 15 నుంచి 17 సంవత్సరంలోపు 19 మంది ఉన్నారని చెప్పారు. వీరి సామర్ధ్యాలను బట్టి ఆయా తరగతుల్లో చేర్పిస్తామని వివరించారు.

సంబంధిత పోస్ట్