బి. ఆర్ అంబేద్కర్ 134 జయంతి పురస్కరించుకొని సోమవారం జహీరాబాద్ లో జరిగే డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మహా ర్యాలీలో అందరూ పాల్గొనాలని ఆదివారం పిచర్యాగడి గ్రామంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అంటే అందరివాడు అని, కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.