జహీరాబాద్: సీఎంకు ధన్యవాదాలు తెలిపిన చంద్రశేఖర్

77చూసినవారు
జహీరాబాద్: సీఎంకు ధన్యవాదాలు తెలిపిన చంద్రశేఖర్
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, జహీరాబాద్ ఇన్‌చార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటగా అమోదం తెలపడం ఆనందంగా ఉందన్నారు. 30, 40 సంవత్సరాలుగా సాగిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తగిన ఫలితం దక్కిందని అన్నారు.

సంబంధిత పోస్ట్