జహీరాబాద్ పట్టణంలో శనివారం జరగబోయే హనుమాన్ జయంతి వేడుకలను విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ శ్రీ వీర హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరగనున్నాయని శుక్రవారం కమిటీ సభ్యులు ప్రకటనలో తెలిపారు. జహీరాబాద్ పట్టణంలోని శ్రీ మాణిక్ ప్రభు మందిర్ నుండి సాయంత్రం ఐదు గంటలకు భారీ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కావున హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరారు.