
నడి రోడ్డుపై మహిళను కాలితో తంతూ.. జుట్టు పట్టి కొట్టాడు
ఇటీవలి కాలంలో మహిళలపై దాడులు పెరిగాయి. తాజాగా ఓ యువకుడు ఓ మహిళను చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నడి రోడ్డుపై మహిళను పలుమార్లు కాలితో తంతూ వేదింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో జుట్టు పట్టి కొడుతూ రోడ్డపైకి ఈడ్చుకెళ్లాడు. అయితే అటుగా వెళ్తున్నా ఎవరూ కూడా ఈ దారుణాన్ని ఆపకపోవడం గమనార్హం. కాగా ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.