జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మార్సీ ఆవరణలో పీఆర్టీయూ ఆవిర్భావ సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పీఆర్టీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డా. తులసిరామ్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రిటైర్డ్ అయిన ఉపాధ్యాయ, ఉపాధ్యాయునిలకు పీఆర్టీయూ నాయకులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ అర్బన్ అధ్యక్షులు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి తుకారామ్ చవ్వాణ్, జహీరాబాద్ రూరల్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.