పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల్లో అల్పాహారం కోసం నిధులు మంజూరైనట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 7, 757 మంది విద్యార్థులకు 38 రోజులకు రూ. 44. 21 లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. ఒక్క విద్యార్థికి రూ.15 చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. నిధులు నేరుగా పాఠశాల ఖాతాలలో జమవుతాయని వివరించారు.