జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలకు ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 18వ తేదీన పాఠశాలలో యధావిధిగా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహించవద్దని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.