

అత్తను కిందపడేసి కొట్టిన కోడలు (వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని గోవింద్పురంలో ఒక కోడలు తన అత్తని కింద పడేసి కొట్టింది. ఈ సంఘటన జూలై 1న జరిగింది. అత్తాకోడళ్ల మధ్య జరిగిన వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. మెట్లపై అత్తాకోడళ్లు కొట్టుకున్న దృశ్యాలు CCTVలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, పెద్దవాళ్ల పట్ల గౌరవం లేకుండా చేయి చేసుకోవడం తప్పని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.