TG: దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ఆర్టీసీ బస్టాండ్‌లు, డిపోల్లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా సహేలి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ములుగు, హనుమకొండ బస్టాండ్‌లలో ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు విస్తరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు.