శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లకు నాలుగో రోజు నందివాహన సేవ, ఐదో రోజు రావణ వాహన సేవలు జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు చెప్పారు. అదే విధంగా గోశాలలోని శ్రీకృష్ణుని విగ్రహానికి షోడశోపచార పూజాక్రతువులు నిర్వహించడంతోపాటు వృషభాలకు కూడా విశేష పూజలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు.