మీరు 40 ఏళ్ల నుంచే ప్రతి నెలా పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసమే LIC సంస్థ 'సరళ్ పెన్షన్ యోజన' అనే పథకాన్ని అమలు చేసింది. ఇందులో 40 నుంచి 80 ఏళ్లలోపు వారు ఒక్కసారి పెట్టుబడి పెడితే, జీవితాంతం పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు.. రూ.30 లక్షల యాన్యుటీ కొంటే నెలకు రూ.12,500 పెన్షన్ వస్తుంది. పాలసీదారు మరణిస్తే, పెట్టుబడి మొత్తం నామినీకి తిరిగి ఇస్తారు. ఈ పథకం సులభమైన, సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును అందిస్తుంది.