TG: జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న సరస్వతి పుష్కరాల వెబ్‌సైట్ ప్రారంభమైంది. ఈ పుష్కరాల వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ లాంఛ్ చేశారు. మే15 -26 వరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పుష్కరాలు నిర్వహించనున్నారు. కాగా, పుష్కరాల ప్రారంభ తేదీని శృంగేరీ పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి ఇదివరకే ముహుర్తం నిర్ణయించిన విషయం తెలిసిందే.