రేపటి నుంచి సరస్వతి నది పుష్కరాలు.. కాళేశ్వరంలో ఘనంగా ఏర్పాట్లు (వీడియో)

63చూసినవారు
TG: సరస్వతి నది పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. మే 15 నుండి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంలో ఘనంగా ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. గురువారం సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్కర ఘాట్‌ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. కాళేశ్వర త్రివేణి సంగమంలో సీఎం రేవంత్‌ పుణ్యస్నానం ఆచరించనున్నారు.

సంబంధిత పోస్ట్