TG: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అంతర్వాహిని సరస్వతీ నదికి గురువారం నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి పన్నెండు రోజుల పాటు కొనసాగుతాయి. పుష్కరాలకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇవాళ తొలిరోజు త్రివేణి సంగమం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి పుణ్యస్నానం ఆచరిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.