TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా సరిత

66చూసినవారు
TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా సరిత
తెలంగాణ RTCలో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా సరిత చరిత్ర సృష్టించారు. భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన సరిత, TGSRTCలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా శనివారం విధుల్లో చేరారు. తొలి రోజు హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు బస్‌ నడిపారు. ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేసిన ఆమె, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం రాష్ట్రంలో పని చేసే అవకాశం కోరగా, మంత్రుల సహకారంతో RTCలో ఆమెకు అవకాశం లభించింది.

సంబంధిత పోస్ట్