సింగరేణి కార్మికులకు సర్కార్ చేదు కబురు: హరీశ్

77చూసినవారు
సింగరేణి కార్మికులకు సర్కార్ చేదు కబురు: హరీశ్
సింగరేణి కార్మికుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం అడియాశలు చేసిందని BRS నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దసరాకు తీపి కబురుకు బదులు చేదు కబురు చెప్పిందని ఘాటైన విమర్శ చేశారు. 'మా హయాంలో రూ.2,222 కోట్ల లాభాలు వస్తే రూ.710 కోట్ల బోనస్ ఇచ్చాం. కానీ ఇప్పుడు రూ.4,701 కోట్ల లాభం వచ్చినా రూ.796 కోట్లే ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా 33% లాభాలు పంచితే మిగతా రూ.754 కోట్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్