భారతదేశంలోని అత్యంత ధనవంతుల విషయానికి వస్తే, ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు
అంబానీ,
అదానీ. కానీ జిందాల్ గ్రూప్ చైర్ పర్సన్ సావిత్రి జిందాల్ ఈ ఏడాది భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆమె ఈ సంవత్సరం మొత్తం $9.6 బిలియన్లను సంపాదించింది. దీంతో ఆమె 25.3 బిలియన్ డాలర్ల సంపదతో ఇండియాలోనే అత్యంత సంపన్న మహిళగా అవతరించింది.