TG: ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఈ భేటీ నిర్వహించింది. సోమవారం ఉదయం మరో సారి సమావేశం నిర్వహించి ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. భేటీలో చర్చించిన విషయాలకు సంబంధించిన మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి జీవో విడుదల చేస్తామని తెలిపారు.