TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల గడువును మార్చి 31 వరకు పొడిగించారు. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ-పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసేందుకు గతంలో గడువు విధించారు. 7.44 లక్షల మంది రెన్యువల్ విద్యార్థుల్లో 4 లక్షల మంది, 4.83 లక్షల మంది కొత్త వారిలో కేవలం 1.39 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. దీంతో గడువు పొడిగించారు.